గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేపు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ

3 రోజుల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 10:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ఒకరోజు పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం ఉదయం 9.15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని, మధ్యాహ్నం 12.10 గంటలకు 1 జనపథ్‌కు చేరుకుంటారు.

కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశాల అనంతరం సాయంత్రం 6.50 గంటలకు 1 జనపథ్‌ నుంచి బయలుదేరి రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు పయనమవుతారు. రాత్రి 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్