శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కుప్పంలో సిఎం చంద్రబాబు రెండోరోజు పర్యటన

2 గంటల క్రితం

కుప్పంలో సిఎం చంద్రబాబు రెండోరోజు పర్యటన
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 12:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు శనివారం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ నియోజకవర్గ, వ్యక్తిగత సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన ముఖ్యమంత్రి ... సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం.. చంద్రబాబు నలగంపల్లె గ్రామంలో పర్యటించారు. గ్రామంలో వినూత్నంగా నెట్ జీరో విధానాన్ని అవలంభిస్తోన్న ఇళ్లను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. పర్యావరణహితంగా రూపుదిద్దుకున్న ఈ ఇళ్లలోని రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్‌టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి పర్యావరణహిత పద్ధతులను పాటించడంపై హర్షం వ్యక్తం చేశారు. నలగంపల్లిలోని ఓ గ్రామస్థుడి ఇంటికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లారు. సోలార్ విద్యుత్ వినియోగంపై ఆరా తీశారు. పర్యటన సందర్భంగా రూ.9,322 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు పలువురు పారిశ్రామిక సంస్థలతో అవగాహన ఒప్పందాలను ముఖ్యమంత్రి కుదుర్చుకోనున్నారు. అలాగే రూ.952 కోట్లతో మూడు ట్రాన్స్కో సబ్‌స్టేషన్లు, ఇస్కాన్ ఆలయం, గ్రానైట్ హెరిటేజ్ స్టోన్ క్లస్టర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కుప్పంలోని ప్రాజెక్టుల పురోగతిపై పారిశ్రామికవేత్తలు, అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్