గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమత్స్యకారుల గల్లంతుపై సిఎం సమీక్ష

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీపై సిఎం చంద్రబాబు గురువారం సమీక్ష చేశారు. క్యాంప్ కార్యాలయంలో మత్స్యశాఖ అధికారుల తో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో కొద్ది రోజుల క్రితం గల్లంతైంది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను అధికారులు సిఎంకు వివరించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారని, విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరణ ఇచ్చారు. ‘బోటు లో ట్రాన్స్ పాండర్, బోటు ఒంటరిగా ఎందుకు వెళ్లింది, బోటు గల్లంతు అయినట్టు ఎప్పుడు సమాచారం వచ్చింది? గాలింపు చర్యలు ఎప్పుడు ప్రారంభించారు’ అనే అంశాలపై అధికారులను సిఎం ప్రశ్నించారు. వేటకు వెళుతున్న మత్స్యకారులకు సాంకేతికంగా అందుతున్న సాయం, రోజువారీ సమన్వయ వ్యవస్థలపై సిఎం సమీక్ష చేశారు. ఘటన తరువాత రియాక్ట్ అవ్వడం కాదు, ఇటువంటి ఘటనలు జరగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు తప్పకుండా నమోదు చేయాలన్నారు. వేటకు వెళ్లే వారి వివరాలు ఉంటేనే సత్వర సాయం సాధ్యం అవుతుందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో, సహకారంతో మత్స్యకారులు ప్రమాదాలు బారిన పడకుండా చూడాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్