డిసెంబర్లో అన్ని రాష్ట్రాల సీఎస్ ల సదస్సు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి శాఖలవారీగా వివరాలు సిద్ధం చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. ఇదే సమయంలో డిసెంబర్ లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం కూడా ఢిల్లీలో జరగనుంది. ఇప్పటి వరకు ఐదు భేటీలు జరగ్గా ఇది ఆరో సదస్సు కావడం విశేషం. వీటికి సంబంధించి కూడా క్షేత్ర స్థాయి నుంచి సమాచారాన్ని తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.








కామెంట్‌లు (0)