శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆన్‌కాల్ డ్రైవర్ కుటుంబానికి రూ.80 లక్షల పరిహారం ఇవ్వాలి

1 గంట క్రితం

గుండెపోటుతో బస్సులోనే ప్రాణాలొదిలిన ఆర్‌‌టిసి డ్రైవర్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిఐటియు, ఎపిపిటిడి ఎస్‌డబ్ల్యుఎఫ్

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాకినాడ డిపోకు చెందిన ఆన్‌కాల్ డ్రైవర్ జట్ల శివ (34) విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి రెగ్యులర్ ఉద్యోగి మాదిరిగా రూ.80 లక్షల పరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నరసింగరావు, ఎవి నాగేశ్వరరావు, ఎపిపిటిడి స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. ఈ నెల 8న ఉదయం కాకినాడ నుంచి విశాఖపట్నానికి నాన్‌స్టాప్ బస్సు నడుపుతున్న శివకు మార్గంమధ్యలో గుండె నొప్పి వచ్చి మృతిచెందారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు ఏడు కిలోమీటర్లు బస్సు నడిపి ప్రయాణికులను నక్కపల్లి వరకు సురక్షితంగా చేర్చారని పేర్కొన్నారు. స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోగా, ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. ఆర్‌టిసిలో విధి నిర్వహణలో రెగ్యులర్ ఉద్యోగి మరణిస్తే రూ.80 లక్షల పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, ఆన్‌కాల్ కార్మికుల కుటుంబాలకూ సమాన ప్రయోజనాలు కల్పించాలని కోరారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తాత్కాలిక కార్మికులు విధుల్లో ఉండగా మరణిస్తోన్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని శివ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని ఆర్‌టిసి ఆన్‌కాల్ కార్మికులకు పిలుపునిచ్చారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్