శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్ల గుడ్‌‌బై

1 గంట క్రితం

భారత మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్ల గుడ్‌‌బై
తొమ్మిది రోజుల్లో రూ.60 వేల కోట్ల ఉపసంహరణ
ఈ ఏడాదిలో రూ.4 లక్షల కోట్లకు పైగా.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 11:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తొమ్మిది రోజుల్లో రూ.60 వేల కోట్ల ఉపసంహరణ

  • ఈ ఏడాదిలో రూ.4 లక్షల కోట్లకు పైగా..

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలతో సూచీలు కుదేలవుతుండగా.. సామాన్య మదుపరుల పెట్టుబడుల విలువ కూడా కరిగిపోతోంది. 2026లో ఇప్పటివరకు విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌పిఐ) భారత ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.4 లక్షల కోట్లకు పైగా ఉపసంహరించుకోగా.. గత తొమ్మిది రోజుల్లోనే దాదాపు రూ.60,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. నిఫ్టీ తన గరిష్ఠ స్థాయి నుంచి 15 శాతానికి పైగా పడిపోవడం మార్కెట్‌లో నెలకొన్న ఒత్తిడికి అద్దం పడుతోంది. అమెరికా మార్కెట్లు పడిపోయినప్పుడు భారత మార్కెట్‌ కూడా క్షీణించడం ఒక ఎత్తయితే.. అక్కడ సూచీలు పెరిగినప్పటికీ ఇక్కడ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటం మదుపరులను కలవరపెడుతోంది. మార్కెట్‌ పతనాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధానపరమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్‌కు దూరమవడానికి పలు కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రూపాయి రికార్డ్‌ ‌పతనం విదేశీ మదుపరుల డాలర్లలో వచ్చే రాబడులను తగ్గిస్తోంది. భారత మార్కెట్‌లో షేర్ల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పడిపోతే డాలర్లలో లెక్కించే పెట్టుబడిదారులకు నష్టం వాటిల్లుతుంది. మరోవైపు దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్‌టిసిజి) 12.5 శాతం, స్వల్పకాలిక మూలధన లాభాలపై (ఎస్‌టిసిజి) 20 శాతం పన్నులు, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఒ) లావాదేవీలపై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టిటి) పెంపు పెట్టుబడులపై వచ్చే నికర రాబడులను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. మార్కెట్‌లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్షణ విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రూపాయి పతనాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు అవసరం అనే అంశాలపై స్పష్టమైన సమీక్ష జరగాలని అంటున్నారు. అదే సమయంలో దేశీయ రిటైల్‌ మదుపరుల ప్రయోజనాలనూ విస్మరించరాదని పేర్కొంటున్నారు. ప్రస్తుత పతనం చిన్న మదుపరుల పొదుపుపై ప్రభావం చూపుతోందని విశ్లేషిస్తున్నారు. విధాన సమీక్షలకే పరిమితం కాకుండా మార్కెట్‌లో విశ్వాసాన్ని పెంచే నిర్ణయాలు తీసుకోకపోతే మార్కెట్లు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్