శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవైఎస్‌ షర్మిల హౌస్‌ అరెస్ట్‌

1 గంట క్రితం

వైఎస్‌ షర్మిల హౌస్‌ అరెస్ట్‌
- ఇసి, మోడీ తీరుపై నిరసన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఇసి, మోడీ తీరుపై నిరసన

ప్రజాశక్తి - గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరం ఎస్ఎల్‌‌వి విల్లాస్‌లో ఎపిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. శాంతియుతంగా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు సిద్ధమైన తమను పోలీసులు అడ్డుకోవడాన్ని, నిరసన తెలపకుండానే హౌస్ అరెస్ట్ చేయించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, తమ వద్ద ఎలాంటి ఆయుధాలూ లేవని, చంద్రబాబు ప్రభుత్వం తమ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు.

​ఓటు హక్కుపై దాడి జరుగుతోందని బిజెపి ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం మోడీ చేతుల్లో కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. కేంద్రంలోని స్వయం ప్రతిపత్తి సంస్థలన్నీ ప్రభుత్వం గుప్పిట్లోనే ఉన్నాయని షర్మిల అన్నారు. సిఇసి జ్ఞానేష్‌ను పదవి నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్