ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వేతనాల పెంపుకై కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన స్కీం వర్కర్లకు అభినందనలు

1 రోజు క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 05:47 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- సిఐటియు రాష్ట్ర కమిటి

ప్రజాశక్తి - విజయవాడ : వేతనాల పెంపుకై కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన స్కీం వర్కర్లకు సిఐటియు రాష్ట్ర కమిటి అభినందనలు తెలిపింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. నరసింగరావు, ప్రధాన కార్యదర్శి ఏ.వి. నాగేశ్వరరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దీనిలో ''అంగన్‌వాడీ, ఆశా, ఎండిఎం, విఓఏ, ఆర్‌పీలు, స్కూల్ స్వీపర్స్, సమగ్రశిక్ష, నేషనల్‌హెల్త్ మిషన్, ఉపాధిహామీ, వెలుగు తదితర స్కీం వర్కర్లకు కనీస వేతనాలు రూ.26,000/`లు ఇవ్వాలని, సామాజిక భద్రతా సౌకర్యాలైన పెన్షన్, పిఎఫ్, ఇఎసఐ, గ్రాట్యూటీ తదితర సౌకర్యాలు అమలు చేయాలని, అంగన్‌వాడీలకు నవచేతన యాప్ రద్దు చేయాలని, ఆశా వర్కర్ల పనిభారం తగ్గించాలని, మధ్యాహ్నా భోజన కార్మికుల ఉపాధికి దెబ్బతీసే స్మార్ట్ కిచెన్లు రద్దుచేయాలని, విఓఏ, ఆర్‌పి, స్కూల్ స్వీపర్స్‌కు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లా కలెక్టరేట్ల దగ్గర పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసిన స్కీం వర్కర్లందరికీ సిఐటియు రాష్ట్ర కమిటి అభినందనలు తెలియజేసింది. స్కీం వర్కర్ల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న స్కీం వర్కర్లను, సిఐటియు నాయకత్వాన్ని పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడాన్ని, గాయపర్చడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ల దగ్గర జరిగిన కార్యక్రమాల్లో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి.నాగేశ్వరరావు, డిఎన్‌విడి ప్రసాద్ పాల్గొన్నారు. పోలీసులు అడ్డగించడంతో కలెక్టరేట్లకు వెళ్ళటానికి తీవ్రమైన తోపులాట జరిగింది. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఆందోళనలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్.నరసింగరావు గారు పాల్గొన్నారు. పోలీసులు స్కీం వర్వర్ల మీద తీవ్ర లాఠీచార్జ్ చేశారు.విఓఏ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్.రూపాదేవి కి ఫ్రాక్చర్ అయ్యింది. మరో 4గురు గాయపడ్డారు. అనేక మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. పార్వతీపురంలో వర్షం సైతం లెక్కచేయకుండా వేలాది మంది స్కీం వర్కర్లు కలెక్టరేట్ల ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి మన్మదరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగు నాయుడు గారితో సహా స్కీం వర్కర్లు అనేక మందిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన తోపులాటలో సిఐటియు జిల్లా కార్యదర్శి తేజేశ్వరరావు, అంగన్‌వాడీ నాయకులు సుధ అనేక మంది అరెస్టు అయ్యారు. సత్యసాయి, కడప, ఏలూరు, తిరుపతి జిల్లాలో కందారపు మురళి తదితర జిల్లాల్లో పోలీసులు స్కీం వర్కర్ల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్ల ఆందోళనను అణచటానికి ప్రయత్నం చేసి విఫలమయ్యింది. ఎన్‌టిఆర్ జిల్లాలో జరిగిన ధర్నాలో అంగన్‌వాడీ యÖనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, సిఐటియు ఉపాధ్యక్షులు పి.అజయ్ కుమార్, ఎన్.సి.హెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్ఓ ధర్నా దగ్గరకు వచ్చి అర్జీలు స్వీకరించారు. గుంటూరు జిల్లాలో కలెక్టరేట్ల ఆందోళనలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, బాపట్ల జిల్లాలో జరిగిన ఆందోళనలో ఆశా వర్కర్ల యÖనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా డిఆరఓ గారు అర్జీలు స్వీకరించారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ఆందోళనలో మధ్యాహ్నా భోజన కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఆందోళనలో తీవ్ర ఘర్షణలు జరిగాయి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ముజఫర్ అహమ్మద్, అన్నమయ్య జిల్లాలో జరిగిన ఆందోళనలో ఆర్.వి.నరసింహారావు, ఎఎసఆర్ జిల్లాలో భారీ ర్యాలీ జరిగింది. ప॥గో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలో రాయ్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో కలెక్టరేట్ల ఆందోళనలో శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు నిర్మల, అనంతపురం జిల్లాలో నాగేంద్ర, నంద్యాల జిల్లాలో నాగరాజు, కాకినాడలో జి.బేబిరాణి, విశాఖలో పి.మణి తదితరులు పాల్గొని మాట్లాడుతూ స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26,000/` ఇవ్వాలని డిమాండ్ చేశారు.కలెక్టరేట్ల వద్ద పెద్దసంఖ్యలో స్కీం వర్కర్లు పాల్గొని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని నినదించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైన పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని లేనిపక్షంలో మరో పోరాటానికి సిద్దమవుతారని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము'' అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్