కేంద్ర మంత్రికి కొల్లు రవీంద్ర వినతి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అండగా నిలిచే మచిలీపట్నం-బంటుమిల్లి రోడ్డు నిర్మాణానికి సహకరించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. బుధవారం నాడిక్కడ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీని ఆయన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కలిశారు. ఈ రోడ్డు నిర్మాణంతో మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్‌కు రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో కృష్ణా జిల్లాలోని బందరు పోర్టు నుండి మంగినపూడి బీచ్ మీదుగా బంటుమిల్లి వరకు జాతీయ రహదారి 216కు అనుసంధానించాలని విన్నవించారు. కృష్ణా జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వీలుగా ఇండోర్ స్టేడియం, స్మిమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఖేలో ఇండియా కార్యక్రమంతో సహాయం అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. కేంద్ర యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేను కూడా మంత్రి కొల్లు రవీంద్ర కలిసి మచిలీపట్నం గోసంఘం వద్ద నిర్మించ తలపెట్టిన ఇండోర్ స్టేడియం కోసం రూ.17 కోట్లు, స్మిమ్మింగ్ పూల్ కోసం రూ.9 కోట్ల నిధులుయ మంజూరు చేయాలని కోరారు. అలాగే, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వాలని విన్నవించారు.








కామెంట్‌లు (0)