బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపూర్తి సామర్ధ్యంతో విద్యుదుత్పత్తి యూనిట్లు : జెన్‌కో ఎమ్‌డి నాగలక్ష్మి

59 నిమిషాల క్రితం

AP Genco  S Nagalakshmi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 10:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలంటే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్ధ్యంతో పనిచేయడం అత్యంత కీలకమని జెన్‌కో ఎమ్‌డి ఎస్ నాగలక్ష్మి తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (విటిపిఎస్)ను థర్మల్ డైరెక్టర్ అశోక్ కుమార్ రెడ్డితో కలిసి బుధవారం ఆమె తనిఖీ నిర్వహించి సమీక్ష చేశారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అన్ని ఉత్పత్తి యూనిట్లను గరిష్ట సామర్ధ్యంతో నిర్వహిస్తూ రాష్ట్ర గ్రిడ్‌కు నిరంతర విద్యుత్ అందించేందుకు అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్ఎఫ్)ను మరింత పెంచడంతో పాటు ముందస్తు నిర్వహణ చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు. ట్రిప్పింగులు, సాంకేతిక లోపాలు, బ్రేక్ డౌన్లు తగ్గించేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కనీసం 10 రోజుల అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బొగ్గు సరఫరా సంస్థలు, రైల్వే శాఖతో నిరంతర సమన్వయం కొనసాగించాలని సూచించారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన 800 మెగావాట్ల స్టేజ్-5 యూనిట్‌ను పూర్తిసామర్ధ్యంతో నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల నిబంధనలకు అనుగుణంగా ఎస్‌‌పిఎం ఉద్గార స్థాయిలను సాధించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్