బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమమ్మల్ని అరెస్టు చేయొద్దు

1 గంట క్రితం

jogi ramesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 09:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించిన జోగి రమేశ్‌ కుటుంబం

ప్రజాశక్తి - ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా ప్రతినిధి : గృహహింస కేసులో తమను అరెస్ట్‌ చేయొద్దని మాజీ మంత్రి, వైసిపి నాయకులు జోగి రమేశ్‌, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం విజయవాడ మహిళా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మహిళా కోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేశ్‌, ఆయన కుటుంబ సభ్యులపై ఆయన పెద్ద కోడలు జోగి మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్‌‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులుగా జోగి రమేష్, అతని సోదరుడు రాము, సోదరి రమ, కుటుంబ సభ్యులు 11 మందిని చేర్చారు. జోగి రాజీవ్, రమేష్, శకుంతల, రోహిత్, ప్రియాంక, జోగి రాము, అతని ఇద్దరు కుమారులు రాకేష్, పాండు, స్వామి, రమ, సాయి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్