శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కిరణ్‌ మృతి పట్ల వి శ్రీనివాసరావు దిగ్ర్భాంతి..

6 గంటల క్రితం

gafoor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 10:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సిపిఎం సీనియర్ నాయకులు ఎం.ఏ.గఫూర్, నిర్మల పెద్ద కుమారుడు కిరణ్ మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అమెరికా కాలిఫోర్నియాలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తూ అకస్మాత్తుగా మరణించిన కిరణ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఈ వార్త తెలియడంతోనే గఫూర్, నిర్మలను ఫోన్ ద్వారా పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా వుండాలని విజ్ఞప్తి చేశారు. కిరణ్ మరణంపై సానుభూతిని తెలిపారు. మంచి భవిష్యత్‌ ఉన్న కిరణ్ అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు. ఈ దు:ఖ సమయంలో ఆ కుటుంబానికి పార్టీ వెన్నంటి ఉంటుందని తెలిపారు.

వైఎస్ జగన్, లోకేష్‌ సంతాపం

కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు ఎం.ఏ అబ్దుల్ గఫూర్, రాష్ట్ర నాయకులు పి నిర్మల పెద్ద కుమారుడు కిరణ్ అమెరికాలో ఆకస్మికంగా మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించి, అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రముఖ సంస్థలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తూ మంచి భవిష్యత్తు కలిగిన కిరణ్ అకాల మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. కన్నకొడుకును కోల్పోయిన ఎం.ఏ అబ్దుల్ గఫూర్, పి నిర్మల దుఃఖం వర్ణనాతీతమన్నారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కిరణ్‌ ‌మృతి పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఒక ప్రకటనలో సంతాపం వెలిబుచ్చారు. కిరణ్‌ ఆకస్మిక మరణం తీరని లోటని, గఫూర్‌‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష‍, ప్రధానకార్యదర్శులు సిహెచ్‌ నర్సింగరావు, ఎవి నాగేశ్వరరావు కూడా కిరణ్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్