గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం

3 రోజుల క్రితం

cyclone .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చీరాల : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం చెన్నైకు 700 కి.మీ., విశాఖపట్నానికి 800 కి.మీ., గోపాల్‌పూర్‌కు 910 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని సోమవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్‌ సీఈవో ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ఇది సాయంత్రానికి తుపానుగా, రేపు తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు-తుని మధ్య అతితీవ్ర తుపానుగా తీరం దాటే సూచనలున్నాయని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో ఈదురుగాలులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120-145 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ఇటీవల అర్నబ్‌, మురసు తుపానులు కోస్తాంధ్రను వణికించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్