గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అధ్వానంగా దళితవాడలు

1 గంట క్రితం

dalit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 11:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మురికి నీటితో నిండి ఉన్న దళితవాడ

- ఇరికివంతెనతో రాకపోకలకు అవస్థలు

ప్రజాశక్తి-కోటనందూరు: ప్రభుత్వాలు పాలకులు మారుతున్నప్పటికీ దళితవాడలో అభివృద్ధికి నోచుకోవడం లేదని దళితులు ఆవేదన చెందుతున్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో 17 దళిత వడలు ఉన్నాయి. దళిత కాలనీలో కనీసం మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లిపూడి దళితవాడలో గత ప్రభుత్వంలో 2021 సంవత్సరంలో వైయస్సార్ గృహ నిర్మాణ పథకం ద్వారా పంట భూముని అనుకొని 52 మంది దళితులకు నివాస స్థలాలను ఇచ్చారు. మీరు నివాసాలు ఏర్పాటు చేసుకుని నాలుగు సంవత్సరాల అవుతున్నప్పటికీ ఈ కాలనీలో కనీసం వసతులు డ్రైనేజీలు, సిసి రోడ్డు ఏర్పాటు చేయలేదని అన్నారు. కాలనీ పంటపొలాలను ఆనుకొని ఉండటం పంట పొలాల్లో వచ్చే నీరు నివాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుందని, దీనితో నీరుతో కాలనీ అంతా నిండిపోయి బురదమయంగా మారుతుందని, పిల్లల స్కూలుకి, అంగన్వాడి సెంటర్లకు వెళ్లాలన్న బురద రోడ్లు నుంచే వెళ్ళవలసి పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు నిల్వ ఉండిపోవడంతో ఈగలు దోమలు, పందులు, స్వర వ్యవహారం చేస్తున్నాయని దళిత మాజీ సర్పంచ్ తరిపే నూకాలమ్మ , కాలనీవాసులు దిమలి రమణ, చిట్టమూరి పెద్దబ్బాయి, దిమ్మెలి కొండయమ్మ, పండుగ కొండబాబు, దిమ్మెలు చిన్న, దారకొండ ప్రసాద్ తెలిపారు. తాసిల్దార్ పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. దళితవాడలోకి వెళ్లాలంటే సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు ఇరికి వంతెన ద్వారానే రాకపోకలు సాగుతున్నాయని అన్నారు. భీమవరపుకోట దళితవాడలో 6, 7 వార్డులో డ్రైనేజీలో అధ్వానంగా ఉన్నాయని, ఇంటింటి కులాయిలు నిర్మాణం చేపట్టలేదని దీంతో త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్మశాన పిచ్చి తప్పులతో నిండిపోయిందని సుబ్రపరసాలని స్థానికుల కోరారు. దళిత గ్రామాల్లో ఉన్న స్మశాన వాటికలు అన్ని ఇదే పరిస్థితిలో ఉన్నాయని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్