ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : విద్యుత్ సంస్థల్లో 629కు పైగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎఇఇ) పోస్టుల భర్తీ దరఖాస్తు గడువుకు ఎలాంటి పొడిగింపు లేదని ట్రాన్స్ కో జెఎమ్‌డి సాయి సూర్య ప్రవీణ్ చంద్ వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పిస్తున్న నేపథ్యంలో, దరఖాస్తుల గడువు పొడిగింపుపై సామాజిక మాధ్యమాలు, ఇతర అనధికారిక వేదికల్లో ప్రచారంలో ఉన్న వార్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించొద్దని సోమవారం ఒక ప్రకటనలో అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. నియామక నోటిఫికేషన్‌లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని, దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వీలైనంత త్వరగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమర్పించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 22 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు.








కామెంట్‌లు (0)