బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ పర్యటన పేరుతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం దుర్మార్గం

31 జులై, 2026

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్‌ఎఫ్‌ఐ

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భోగాపురం విమానశ్రయం ఆవిష్కరణకు ప్రధాని నరేంద్రమోడీ వస్తున్న తరుణంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి రామ్మోహన్‌, కె ప్రసన్నకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ పర్యటన పేరుతో విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, అమలాపురం తదితర జిల్లాల్లో రెండు రోజులు పాటు సెలవులు ప్రకటించడం ఏమాత్రం సమంజసం కాదని తెలిపారు. మోడీ పర్యటనకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వెంటనే సెలవుల నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్