ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Bay of Bengal - బంగాళాఖాతంలో వాయుగుండం

2 గంటల క్రితం

Depression in the Bay of Bengal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. రేపు (సోమవారం) తీవ్ర వాయుగుండం పారాదీప్ - సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాయుగుండం నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు బుధవారం వరకూ వేటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే 7 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవలను వాడటం అంత సురక్షితం కాదని తెలిపారు. ఈ సమయంలో మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్