సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికలకోసమే డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్‌ అడవితల్లిబాట : వి.శ్రీనివాసరావు

1 గంట క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 02:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆదివాసీల మౌలిక సమస్యలు విస్మరించిన డిప్యూటీ సిఎం :
విజయవాడ : అడవితల్లి బాట పేరుతో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పర్యటన గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించిందని సిపిఐ(యం) రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలు, 1/70 పరిరక్షణ, జివో నెం.3 పునరుద్దరణ, పోలవరం నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటీ సిఎం అడవితల్లిబాటపై సోమవారం ఆయన ఒక ప్ర కటన విడు దల చేశారు. రంపచోడవరం మండలం కాకవాడ గ్రామంలో అడవితల్లి బాట2.O బహిరంగ సభకు హాజరయిన పవన్‌కళ్యాణ్ ఆదివాసీలను ఆందోళనకు గురిచేస్తున్న సమస్యలపట్ల మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారఉ . అనేక సంవత్సరాలుగా పోడు భూముల పట్టాలకోసం గిరిజనులు పోరాడుతున్నారని, అటవీ హక్కుల చట్టం క్రింద వేలాది అప్లికేషన్స్ పెట్టుకున్నారని అన్నారఉ . అయినా వారికి ఇంకా పట్టాలివ్వలేదని, పైగా అటవీ అధికారులు ఆదివాసీ రైతుల్ని సాగుభూముల నుండి బలవంతంగా గెంటేస్తున్నారని అన్నారు. అటవీ అధికారులను నిలువరించి ఆదివాసీలకు రక్షణ కల్పించేందుకు ఆయనశాఖే అయినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. జివో నెంబర్ 3 పునరుద్దరించమని ఆందోళన చేస్తూ నిరుద్యోగ యువత రెండు పర్యాయాలు బంద్ నిర్వహించారని గుర్తు చేశారు. 2025 డిఎస్సీలో గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు పోస్టులు కేటాయించకపోవడంతో ఆందోళన చేపడుతున్నారని, గిరిజన ప్రాంతానికి స్పెషల్ డిఎస్సీ ప్రకటించాలని కోరుతున్నారని అన్నారు. అందుకవసరమైన జివో నెంబర్ 3 పునరుద్దరించాలని పోరాడుతున్నారని అన్నారు.

గతంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నారని, అయినా కనీసం వాటిని పవన్‌కళ్యాణ్ తన పర్యటనలో ప్రస్తావించలేదని అన్నారు. అనేక సంవత్సరాలుగా ఆదివాసీలు 1/70 చట్టం అమలుకోసం పోరాడుతున్నారని అన్నారు. సుప్రీం కోర్టులో గిరిజనేతర పెత్తందారులు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉందని, గిరిజనుల్ని ఉద్దరిస్తామని మాటలు చెప్తున్న ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా భూస్వాముల ఒత్తిడితో చేతులు ముడుచుకొని కూర్చున్నదని మండిపడ్డారు. పైగా కేంద్రం మైనింగ్‌కు అనుమతులివ్వడంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని ప్రభుత్వం ఒకవైపు ప్రకటిస్తున్నదని, మరోవైపు నిర్వాసితులకు పరిహారం పూర్తిగా అందలేదని అన్నారు. నష్టపరిహారం కోసం నిర్వాసితులు అనేక విజ్ఞప్తులు చేశారని, పాదయాత్రలు చేపట్టారని అన్నారు. ఐటిడిఏ వద్ద, కలెక్టరు ఆఫీసుల వద్ద పలు దఫాలు ధర్నాలు చేశారని, అయినా పరిష్కారం కాలేదని అన్నారు. నష్టపరిహారం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారని, కొత్తగా కట్టిన కాలనీలలో సమస్యలు చెప్పనలవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై కనీసం స్పందించకుండా తనవద్ద మంత్రదండం లేదని, సమయం కావాలని పవన్‌కళ్యాణ్ అనటం అన్యాయమని అన్నారు. కేవలం స్థానిక ఎన్నికలలో లబ్ది పొందడానికే ఈ పర్యటన ఉద్దేశమైతే అంతకంటే మోసపూరితం మరొకటి లేదని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు గిరిజనుల సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి, బాధ్యత ఉన్నా వెంటనే పోడు భూములకు పట్టాలివ్వాలని, 1/70 అమలు చేయాలని, జివో నెం.3 పునరుద్దరించాలని అన్నారు. పోలవరం నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి నష్టపరిహారం అందచేయడానికి తక్షణం చర్యలు తీసుకొని తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్