గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడేటా సెంటర్లపై నిపుణుల అధ్యయనం ..

2 గంటల క్రితం

A specific study must be conducted on the establishment of data centers in the states: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:18 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అంతవరకు అనుమతి నిలిపి వేయాలి

  • • సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రాల్లో డేటా సెంటర్లు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే సమయంలో పంచ సూత్రాలపై నిర్దిష్ట అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ తెలియజేసిన ఐదు అంశాలపై నిపుణులచే అధ్యయనం జరిపించాలని, ఆ అధ్యయన నివేదికలు వచ్చేవరకు డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులు అన్నింటిని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డేటా సెంటర్లపై నీతి అయోగ్ నివేదికలో పేర్కొన్న ఏ అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం జరిపిం చలేదని ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరా చేసేందుకు అవసరమైన గ్రిడ్ ఉందా? లేదా ? డేటా సెంటర్లు, సాధారణ విద్యుత్‌ డిమాండ్ మధ్య తేడా ఎంత అనే అంశాలపైనా నిశిత పరిశీలన చేయలేదని తెలిపారు. దీర్ఘకాలిక నీటి లభ్యత, నిల్వలపైనా అధ్యయనం చేయకపోగా, ఎంత నీటి సరఫరా అవసరమో కూడా బహిర్గతం చేయకుండా రహస్యంగా ప్రభుత్వం తొక్కి పెట్టిందని తెలిపారు. పర్యావరణ, సామాజిక, ఆర్థిక ప్రభావ అంచనా నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల చేత రూపొందించలేదని, ప్రజాభిప్రాయ సేకరణ చేయక పోగా డేటా సెంటర్ల వర్గీకరణను కుట్రపూరితంగా ఏ కేటగిరి నుండి బి కేటగిరీకి మార్చేసిందని తెలిపారు. 2006 కేంద్ర పర్యావరణ నిబంధనల్నింటినీ ఉల్లంఘించిందని, ప్రమాదకర వ్యర్ధాలు, ఇ- వేస్టు, బ్యాటరీలు, విపరీత శబ్ద కాలుష్యం వల్ల ప్రజలపై కలిగే దుష్ఫలితాలపై కూడా అధ్యయనం చేయలేదని, లక్షలాదిమంది ప్రజల నివాసాల మధ్య భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. దీర్ఘ కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడీలు, పన్ను రూపంలో వేలకోట్ల రూపాయలు రాయితీలు డేటా సెంటర్లకు కల్పించా రని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. పైగా వేల కోట్ల రూపాయల ప్రజల పన్నుల ఆదా యాన్ని కూడా డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలు కల్పనల కోసం ప్రభుత్వం వినియోగి స్తుందని, పెద్దగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిం చడం లేదన్నారు. డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో ప్రజలు, మేధావులు, పౌర సంస్థలు, సంఘాలు, పర్యావరణ వేత్తలు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోగా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగి స్తోందని విమర్శించారు. ఈ నియంతృత్వ చర్యలు నిలిపివేయాలని, డేటా సెంటర్‌కి ఇచ్చిన అనుమ తులన్నింటిని నిలిపివేయాలని, వాటివల్ల కలిగే తీవ్ర దుష్ఫలితాలపై నీతి అయోగ్ సూచించిన ఐదు సూత్రాల కనుగుణంగా నిపుణుల చేత నిశిత అధ్య యనం జరిపించాలని , ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రాయితీలు, పన్ను మినహాయింపులు, భూములను వెనక్కి తీసుకోవాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్