ప్రజాశక్తి-విజయనగరం జిల్లా : టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల దోమతెరలు పంపిణీ చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని పద్మాపురం పంచాయతీ బడ్నాయకవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఆమె దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకు 28 వేల దోమ తెరలు రాగా, సాలూరు నియోజకవర్గానికి 4,226 దోమ తెరలు వచ్చాయని, వీటిని మండలం నుంచే పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని, విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వలక్ష్యమని అన్నారు. సాలూరు నియోజకవర్గంలో గడిచిన రెండేళ్లలో రూ.500 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛను అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టిడిపి కూటమి ప్రభుత్వమని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్, ఎంఇఒలు సత్యనారాయణ, సతీష్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడెపు యుగంధర్, సాలూరు ఎఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పలువురు నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Print Editionగిరిజన విద్యార్థులకు దోమతెరల పంపిణీ : మంత్రి సంధ్యారాణి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 10:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)