అమరావతి : గొడ్డలి పార్టీ ట్రాప్‌లో పడొద్దని, గొడ్డలి పార్టీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని సిఎం చంద్రబాబు టిడిపి నేతలకు ఆదేశించారు. ఆదివారం టిడిపి ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... గొడ్డలి పార్టీ విష వృక్షమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం కులాలు, మతాలను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రగిలించడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. గొడ్డలి పార్టీ ట్రాప్‌లో పడొద్దని నేతలకు చంద్రబాబు హితవు పలికారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై 45 రోజులపాటు టిడిపి డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో నేతలకు సిఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టిడిపి సహా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నేతలకు సిఎం సూచించారు.
గొడ్డలి పార్టీ ట్రాప్‌లో పడొద్దు : సిఎం చంద్రబాబు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)