- కవిటి మండల పిఇటి పెద్ద అప్పలరాజుపై ఆరోపణలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్సు కోటా కింద డిఎస్‌సి ఉద్యోగం పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెగా డిఎస్‌సిలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన పెద అప్పలరాజు కవిటి మండలం పెద్ద మెళియాపుట్టుగ స్కూల్‌లో పిఇటిగా చేరారు. ఆయన స్పోర్ట్స్ ధ్రువపత్రాలు నకిలీవంటూ ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కంప్లైంట్ సెల్‌కు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో వివాదం తెరపైకి వచ్చింది. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పెద్ద అప్పలరాజు జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఫైనల్‌కి వెళ్లారు. ఆయన తమ్ముడు విశ్వేశ్వరరావు కూడా జాతీయ స్థాయి బాక్సింగ్ ఫైనల్‌లో ఆడారు. ధ్రువపత్రాల అప్ లోడింగ్‌లో పొరపాటున ఒకరి ధ్రువపత్రం మరొకరి పేరుతో అప్ లోడ్ అయ్యాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం మార్చుకునే అవకాశం ఇవ్వడంతో వాటిని సరిదిద్దామని ఉపాధ్యాయుడు అప్పలరాజు చెప్తున్నారు. వెరిఫికేషన్ సమయంలో అధికారుల అనుమతితో లెటర్ రాసి ధ్రువపత్రం మార్చానని అంటున్నారు. తాను కష్టపడే ఉద్యోగం సంపాదించానని, దాన్ని రుజువు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు.
ధ్రువపత్రాలను పరిశీలించాం...
డిఎస్‌సిలో స్పోర్ట్స్ కోటలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుకు సంబంధించిన అర్హత పత్రాలను పరిశీలించామని డిఇఒ ఎ.రవిబాబు చెప్పారు. పేరు, అర్హతలు సరిపోయాయని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన పత్రాలను అమరావతిలో పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.







కామెంట్‌లు (0)