బంగ్లాదేశ్ లక్ష‍్యం 196 పరుగులు
ఆసియా క్రీడలు–2026 మహిళల క్రికెట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ సెంచరీ సాధించింది. 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతర్జాతీయ వైట్‌బాల్ క్రికెట్‌లో షఫాలీకి ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 100 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 40, స్మృతి మంధాన 19 బంతుల్లో 37 పరుగులు చేశారు. భారతి ఫుల్మాలి 5 బంతుల్లో 9 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఫైనల్‌కు చేరాలంటే బంగ్లాదేశ్ ఈ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.








కామెంట్‌లు (0)