ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

1 గంట క్రితం

Software employee commits suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : కుటుంబ కలహాల కారణంగా .... ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక వివరాల మేరకు .... పోచారం డివిజన్ సంస్కృతి టౌన్‌షిప్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సంతోష (26) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. యువతి ఆత్మహత్యకు గల‌ కారణాలపై ఆరా తీస్తున్నారు. ‌మృతురాలి‌ భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ‌కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్