వాషింగ్టన్ : కరేబియన్ సముద్రంలో శనివారం అమెరికా సైన్యం ఒక నౌకపై దాడి చేసి, నలుగురిని హతమార్చింది. మాదకద్రవ్యాల స్మగ్లర్లు లక్ష్యంగా నౌకపై దాడి చేసినట్లు యుఎస్ సదరన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆ నౌకలో మాదకద్రవ్యాలు రవాణా అవుతున్నాయని సైన్యం ఎటువంటి ఆధారాలు అందించలేదు. కొలంబియా, గ్వాటెమాల, హోండురస్ దేశాలు తమ భూభాగంలో నేరపూరిత ముఠాలపై ఉమ్మడి సైనిక కార్యకలాపాలు చేపట్టేందుకు అమెరికాను అనుమతించేందుకు అంగీకరించాయని రక్షణశాఖ కార్యదర్శి పీట్ హెగెసెత్ గత నెలలో పనామా పర్యటన సందర్భంగా తెలిపారు. అయితే ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని గ్వాటెమాల ఖండించింది. ఈక్వెడార్ మార్చిలో అమెరికాతో కలిసి ఇటువంటి మిషన్లనే ప్రారంభించింది.
తూర్పు మహా సముద్రం, కరేబియన్ సముద్ర మార్గాల్లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ‘నార్కో టెర్రరిస్టులు’ లక్ష్యంగా దాడులు జరుపుతున్నట్లు ఏడాది క్రితం ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. లాటిన్ అమెరికాలోని మాదకద్రవ్యాల ముఠాలపై అమెరికా "సాయుధ పోరాటం" చేపడుతోందని ట్రంప్ అన్నారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టడానికి ఈ దాడులు చేపడుతున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. శనివారం జరిపిన తాజా దాడితో అమెరికా సుమారు 69 నౌకలపై దాడులు జరిపామని, సుమారు 231మంది మరణించారు.








కామెంట్‌లు (0)