గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో డ్రగ్స్‌ కలకలం.. ముగ్గురు అరెస్టు

1 గంట క్రితం

arest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 04:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖపట్నం: నగరంలో డ్రగ్స్‌ విక్రయించేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ (MDMA), లీటర్‌ లిక్విడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక నుంచి డ్రగ్స్‌ను నగరంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో మాటువేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను త్రీటౌన్‌ పోలీసులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్‌ సరఫరా వెనుక ఉన్న లింకులు, ముఠాలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్