గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పవన్‌ కళ్యాణ్‌‌ను కలిసిన ఈగల్ ఐజి రవికృష్ణ

5 రోజుల క్రితం

egle
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపముఖ్యమంత్రి పవన్‌ ‌కళ్యాణ్‌‌ను ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజి ఆకే రవికృష్ణ కలిశారు. పవన్ కళ్యాణ్‌ ‌క్యాంపు కార్యాలయంలో

శుక్రవారం మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. ఈగల్ విభాగ వార్షిక నివేదికను పవన్‌‌కు రవికృష్ణ అందించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకొంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్, మహిళలను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకొంటున్న చర్యలను వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్