శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‌సరస్‌ ఆజీవిక మేళాకు పక్కాగా ఏర్పాట్లు

1 గంట క్రితం

kondapalli.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి కొండపల్లి ఆదేశాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలోని పున్నమిఘాట్‌‌లో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ స‌ర‌స్ ఆజీవిక మేళా-2026ను విజ‌య‌వంతం చేసేందుకు అధికారులు ప‌క్కా ఏర్పాట్లు చేసినట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాలశాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ సూచించారు. విజ‌య‌వాడ‌లోని సెర్ప్ కార్యాల‌యంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. తొలిసారిగా విజ‌య‌వాడ‌లో ఈ జాతీయ మేళా జ‌ర‌గ‌డం రాష్ర్టానికి ఎంతో గ‌ర్వ‌కార‌ణమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యాన మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1,500 మంది స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాల ప్రతినిధులు పాల్గొంటార‌ని తెలిపారు. ఈ మేళాలో చేనేత వస్త్రాలు, హస్తకళలు, సహజ ఆహార ఉత్పత్తులు, లైవ్ ఫుడ్ కోర్టులు, ఎఫ్‌పిఒ, సిఎల్‌ఎఫ్, సరస్ శక్తి కలెక్షన్ స్టాళ్లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానున్నాయ‌ని పేర్కొన్నారు. మేళాకు ప్రతిరోజూ 50 వేల నుంచి లక్ష మంది వరకు సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామ‌ని, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 15న మేళాను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు ర‌వాణా, వ‌స‌తి, ఆతిథ్య ఏర్పాట్ల‌లో ఎలాంటి లోటుపాట్లు రానివ్వ‌కూడ‌ద‌న్నారు. ఈ సమావేశంలో సెర్ప్‌ ‌సిఇఒ వాకాటి అరుణ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్