మంత్రి గొట్టిపాటి రవికుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతుందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అయినా సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మూడో ఏడాదిలోకి అడుగుపెట్టామని, ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ లైన్లకు తాత్కాలిక అంతరాయాలు ఏర్పడుతున్నా, విద్యుత్‌శాఖ అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. ట్రాన్స్‌కోను బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. విద్యుత్‌శాఖకు రూ.6 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని, నిర్ణీత గడువులో అవసరమైన అన్ని సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.








కామెంట్‌లు (0)