బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిజయ విహారం ఎడిటర్‌‌పై దాడి చేసిన కశ్యప్‌ ‌రెడ్డిని అరెస్టు ‌చేయాలి

1 గంట క్రితం

cpmlogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 11:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : విజయ విహారం ఎడిటర్‌‌పై దాడి చేసిన కశ్యప్‌ ‌రెడ్డిని అరెస్టు ‌చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బిఆర్‌కె టివి ఛానెల్‌లో చర్చ సందర్భంగా విజయ విహారం సంపాదకులు, జై భారత్ నాయకులు రమణ మూర్తిపై మంగళవారం చెప్పుతో దాడిచేసిన కశ్యప్ రెడ్డిని అరెస్టు చేయాలని కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాముడు, కృష్ణుడు బొమ్మలకు మోడీ తలను తగిలించిన ఫొటోలను ఈ చర్చ సందర్భంగా రమణ మూర్తి ప్రదర్శించి, దేవుళ్ళను రాజకీయాలకు వాడుకోవడాన్ని ఎత్తిచూపారని తెలిపారు. దీనికి ఆగ్రహించిన ఆర్ఎస్ఎస్‌కు చెందిన కశ్యప్‌రెడ్డి అక్కడికక్కడే రమణ మూర్తిపై చెప్పుతో దాడి చేశారని తెలిపారు. ఈ మతోన్మాది తీవ్రవాద చర్యను ఖండించాలని డిమాండ్ చేశారు. రమణ మూర్తికి రక్షణ కల్పించాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్