బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనైపుణ్యాభివృద్ధిలో ఎపికి సహకరించండి

1 గంట క్రితం

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనుల శంకుస్థాపనలో మంత్రి లోకేష్

ప్రజాశక్తి జమ్మలమడుగు/మైలవరం (వైఎస్ఆర్ జిల్లా) : నైపుణ్యాభివృద్ధిలో ఎపికి సహకరించాలని, ఎపి పారిశ్రామిక ప్రగతిలో దాల్మియా భారత్‌‌ది విలువైన భాగస్వామ్యం అని విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రూ.3,100 కోట్లతో ఈ విస్తరణ పనులు చేపట్టడం ఎపి పట్ల దాల్మియా భారత్‌కు ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇక్కడి కార్మికులు, రైతులు ఆంధ్రప్రదేశ్‌‌కు బ్రాండ్‌ అంబాసిడర్లని అభివర్ణించారు. ఇక్కడ రైతులు పిల్లల భవిష్యత్ కోసం భూములు త్యాగం చేశారని తెలిపారు. ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను నిర్మించే తమ ప్రయత్నంలో ఎపి ప్రభుత్వానికి భాగస్వామిగా నిలవాలని దాల్మియా భారత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పునీత్ దాల్మియాను కోరారు. యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించాలని, నైపుణ్యాభివృద్ధిలో ఎపిని దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమతో కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. అశోక విశ్వవిద్యాలయం తరహాలో ఉన్నత విద్యను ప్రోత్సహించే మరో ప్రపంచస్థాయి విద్యాసంస్థను ఎపిలో ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో దాల్మియా భారత్ లిమిటెడ్ గ్రోత్ అండ్ ఎక్స్ పాన్షన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెసి బిర్లా, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ గణేష్ వామనరావు జిర్కుంత్వార్, ప్లాంట్ హెడ్ అర్పన్ పరేఖ్, ప్రాజెక్ట్ హెడ్ అనుపమ్ అగర్వాల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్, బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్