బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిఐ నాగ‌రాజుకు సుప్రీం నోటీసు

1 గంట క్రితం

My life is in danger: CI Nagaraju in the custodial death case.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 11:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : లాకప్‌ ‌డెత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సిఐ నాగారాజుపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. నీ నుంచే ప్రజలకు హాని ఉన్నప్పుడు, నీకెలా ప్రాణహాని ఉంటుందని ప్ర‌శ్నించింది. సిఐ నాగ‌రాజు విచారణ వ్యవహారంపై హైకోర్టు ఉత్తర్వుల స్టే కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను బుధ‌వారం సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విక్రంనాథ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచారించింది. హైకోర్టు ఉత్తర్వులపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదని, ఎలాంటి వ్యాఖ్యాలు చేయడం లేదని ధ‌ర్మాస‌నం పేర్కొంది. పూర్తి స్థాయి విచారణ చేపడుతామని తెలిపింది. బుధవారం విచారణ సందర్భంగా రాజమండ్రి జైలు నుంచి విజయవాడ తరలించడంలో ప్రాణ హాని ఉందని ధ‌ర్మాస‌నానికి సిఐ నాగరాజు తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో నాగరాజు నుంచే ప్రజలకు హాని ఉన్నప్పుడు, ఆయనకేలా ప్రాణహాని ఉంటుందని ధ‌ర్మాస‌నం ప్రశ్నించింది. ఈ సంద‌ర్భంగా సిఐ నాగ‌రాజుకు ధ‌ర్మాస‌నం నోటీసు జారీ చేసి, తదుపరి విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది. కాగా, సిఐ నాగరాజు ట్రాన్సిట్ సమయంలో పూర్తి నిడివి వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు షరతును ఏపి ప్ర‌భుత్వం వ్యతిరేకిస్తుంది. నిరంతర వీడియో నిఘా వల్ల దర్యాప్తు గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది. సాయికృష్ణ మృతదేహం అన్వేషణ, సీన్ రికన్‌స్ట్రక్షన్‌కు హైకోర్టు కండిషన్లు అడ్డంకిగా మారాయని తెలిపింది. నిందితుడిని ఎటువంటి కఠిన షరతులు లేకుండా విచారించేందుకు అనుమతించాలని కోరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్