ప్రజాశక్తి - ఏలూరు : ఈ నెల 3, 4, 5 వ తేదీలలో జరగనున్న ఎపి రైతు సంఘం రాష్ట్ర మహా సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఉన్న డి సి ఎం ఎస్ భవనంలో మూడురోజుల సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 800 మందికి పైగా ప్రతినిధులు ఈ మహా సభలలో పాల్గొనున్నారు. తొలిరోజు శుక్రవారం భారీ ప్రదర్శన, ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుంది. మిగిలిన రెండు రోజులు ప్రతినిధుల చర్చలు జరగనున్నాయి. జాతీయ, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రదర్శనలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు.
రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు ఏలూరు సిద్ధం
03 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 11:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)