ప్రజాశక్తి-సూళ్లూరుపేట రూరల్ : శ్రీహరికోట భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన భారత తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్‌ను జూలై 18 ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్‌కు 'విక్రమ్-1' అని పేరు పెట్టారు. ఈ ప్రయోగానికి 'మిషన్ ఆగమన్' అనే పేరు పెట్టినట్లు స్కైరూట్ ఏరోస్పేస్ వెల్లడించింది. విక్రమ్-1 రాకెట్ సుమారు 20 మీటర్ల ఎత్తు, 40 టన్నుల బరువు కలిగి ఉండగా, లో ఎర్త్ ఆర్బిట్‌లోకి గరిష్టంగా 500 కిలోల పేలోడ్ తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. తొలి ప్రయోగంలో 350 కిలోల పేలోడ్‌తో మొత్తం ఆరు పేలోడ్స్ను అంతరిక్షంలోకి పంపనున్నారు. వీటిలో భారత్‌కు చెందిన ఐదు, జర్మనీకి చెందిన ఒక పేలోడ్ ఉంది. ఈ రాకెట్‌లో 3డీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్, కార్బన్ కంపోజిట్ నిర్మాణం, సాలిడ్ ఫ్యూయెల్ బూస్టర్లు వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. దీంతో సాధారణ రాకెట్లతో పోలిస్తే తక్కువ బరువుతో అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది. 2022లో స్కైరూట్ సంస్థ 'విక్రమ్-ఎస్' సబ్-ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు విక్రమ్-1 విజయవంతమైతే, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది
రేపే 'విక్రమ్-1' ప్రయోగం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 06:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)