కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ భాను ప్రకాష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించి, అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ భాను ప్రకాష్ ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై శుక్రవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ.. ఐఇసి కార్యకలాపాల ద్వారా ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వర్చువల్‌గా, అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు ఎస్ ఢిల్లీరావు, వెంకటేశ్వరరావు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)