మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘స్వయం’ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్‌

06 ఆగస్టు, 2026

kondapalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 08:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వయం ఎపి బ్రాండ్‌‌లో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన 65 ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎంఎస్‌ఎంఇ, గ్రామీణ పేదరిక నిర్మూలనశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఎపి ఉత్పత్తుల ఎగుమతులు, ముడిసరుకుల దిగుమతుల అవకాశాలపై అధ్యయనం చేసి, ఇందుకోసం ఎపిఎన్‌ఆర్‌‌టిఎస్‌‌తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల మంది మహిళలను వ్యాపార, సేవా, పారిశ్రామిక రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. సిఎం చంద్రబాబు ప్రతిపాదించిన ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాల అమలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి అక్కడ గ్రామీణ మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్