ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు

14 జులై, 2026

satyakumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 11:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాలల్లోని 43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామని వెల్లడించారు. జులై 15 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 18 ఏళ్ల విద్యార్థులందరినీ పరీక్షించనున్నట్లు తెలిపారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వైద్యారోగ్యశాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా దీన్ని అమలు చేస్తాయని పేర్కొన్నారు. కంటి పరీక్షలు ప్రతి విద్యార్థికీ జరిగేలా కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్