శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అనంత’లో దొంగ నోట్ల కలకలం

1 గంట క్రితం

fake notes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 11:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- విజయవాడ కేంద్రంగా నకిలీ నోట్ల దందా

- ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీసులు

ప్రజాశక్తి-అనంతపురం క్రైం : అనంతపురంలో నకిలీ నోట్ల తయారీ ముఠాను గురువారం అర్ధరాత్రి విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన విశ్వసనీయ సమాచారం మేరకు.. అనంతపురం నగరం ఆదర్శనగర్‌‌కు చెందిన రాజు, హిందూపురానికి చెందిన సురేష్‌ విజయవాడకు చెందిన మరికొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడి నకిలీ నోట్ల తయారీ చేస్తున్నారు. పక్కా సమాచారంతో విజయవాడ పోలీసులు రాజు, సురేష్‌‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారిని తీసుకొని పోలీసులు అనంతపురం వెళ్లి శారద నగర్‌‌లోని ఓ షాపులో ఉన్న నకిలీ నోట్ల తయారీకి వాడే సామగ్రి, ప్రింటర్లు, నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారిని మళ్లీ విజయవాడకు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్