శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'కరువు'ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

06 అక్టోబర్, 2026

rythu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 06:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

ప్రజాశక్తి మంగళగిరి : రాష్ట్రంలో కరువు పరిస్థితులను పున పరిశీలన చేసి అదనంగా మండలాలు ప్రకటించాలని, కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మంగళగిరిలో గల వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 388 కరువు మండలాలను ప్రకటించడం రైతు, రైతు కూలీలను తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. రాష్ట్రంలో ఎల్ నీ నో ప్రభావం వలన కర్రీ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో 544 మండలాలను కరువుగా గుర్తించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం జూన్వ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 476 ఎంఎం గాను, 218 ఎం ఎం మాత్రమే వర్షం కురిసిందని అన్నారు. లోటు 56% ఉందని అన్నారు. ఖరీఫ్ సీజన్కు కీలకమైన దశలో వర్షపాతం లోటు 50 శాతం పైన ఉండటం వలన రాష్ట్ర మొత్తం దుర్భిక్షంలో పడిందని అన్నారు. శాస్త్రీయంగా ఆలోచించి కరువు మండలాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని అన్నారు. రబీ పంటలకు 20 వేల రూపాయలు రుణం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి కరువు మండలాలను ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య మాట్లాడుతూ పంట రుణాలను రద్దు చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని అన్నారు. పంట నష్టపరిహారం ఎకరానికి 30000 ఇవ్వాలని అన్నారు. ఉచిత క్రాఫ్ ఇన్సూరెన్స్ అన్ని పంటలకు అమలు చేయాలని కోరారు. వెంటనే ఉపాధి హామీ పనులు ప్రారంభించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. కరువు పెన్షన్ రైతులకు, కూలీలకు నెలకు పదివేల రూపాయలు చొప్పున 6 నెలలు ఇవ్వాలని అన్నారు. పశువులకు, జీవాలకు గడ్డి, మేత ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. డైరీ కి పాలు పోసిన రైతులకు లీటర్కు ఐదు రూపాయలు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. అరకు కాపీ రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వ్యవసాయ అధికారి ఐ నాగేశ్వరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ట్రెజరర్ ఎం సూర్యనారాయణ, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు జొన్న శివశంకరరావు, వల్లూరి భారతి, ఆంజనేయులు, కే అజయ్ కుమార్, చంద్రం, గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్