శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకుప్పం పూల మార్కెట్‌ ఎదుట రైతుల ధర్నా

2 రోజుల క్రితం

కుప్పం పూల మార్కెట్‌ ఎదుట రైతుల ధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 08:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కుప్పం (చిత్తూరు జిల్లా) : కుప్పం పూల మార్కెట్‌లో కనీస వసతులు కల్పించాలని, రైతులకు ప్రత్యేకంగా ప్రభుత్వ మార్కెట్‌ నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. కుప్పం పూల మార్కెట్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మార్కెట్‌లో సరిపడా స్థలం లేకపోవడంతో పూలు విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌ బయట పూలు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తే దుకాణాల యజమానులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం నిర్వహించకుండా తక్కువ ధరలకు పూలను కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వం స్పందించి రైతులకు అనుకూలంగా అన్ని వసతులతో కూడిన పూల మార్కెట్‌ను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన కుప్పం ఎఎంసి చైర్మన్‌ రాజు రైతుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే రెండు ఎకరాల స్థలంలో పూల మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్‌ టిడిపి చైర్మన్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌ ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్