ప్రజాశక్తి-అమరావతి : షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ నుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు నేరుగా తుది విచారణకు స్వీకరించింది. తదుపరి దశలో పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని స్పష్టం చేస్తూ కేసును వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఎబి వెంకటేశ్వరరావు స్వయంగా వాదనలు వినిపిస్తూ, ఎపిఎస్‌పిడిసిఎల్ 2021 నుంచి జారీ చేసిన అన్ని ట్రాన్స్‌ఫార్మర్ టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై తదుపరి తుది విచారణ నిర్వహించాలని హైకోర్టు నిర్ణయించింది.
Print Edition‘షిర్డి సాయి..’పై తుది విచారణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 11:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)