శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొండపర్వలో అగ్ని ప్రమాదం

1 గంట క్రితం

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విస్సన్నపేట: ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వలో నూతనంగా ఏర్పాటు చేసిన అవంటల్‌ కంపెనీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కంపెనీలోని ఎలక్ట్రానిక్‌ సామగ్రి దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీ మొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్