శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రష్యా చమురు దిగుమతులపై భారత్‌కు అమెరికా ఊరట

1 గంట క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : అమెరికా టారిఫ్‌ల నుంచి భారత్‌కు బిగ్ రిలీఫ్ వచ్చింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్‌తో సహా మరో ఐదు దేశాలపై ఎలాంటి సుంకాలు ఉండవని ట్రంప్ ప్రకటించారు. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే లిండ్సే ఓ. గ్రాహం చట్టం నుంచి మినహాయింపు ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి వైట్‌హౌస్ విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకునే తొలి ఐదు దేశాలపై సుంకాలు విధించే నిబంధనను ప్రస్తావించినప్పటికీ, అదే ఉత్తర్వులోని సెక్షన్‌ 4 కింద వాటిని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ మినహాయింపు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌కు లిఖితపూర్వకంగా ధ్రువీకరించినట్లు తెలిపారు.

భారత్‌ రష్యా నుంచి భారీగా ముడి చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్‌ 17 నుంచి 22 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో ముంబైలో సమావేశమై, జామ్‌నగర్‌ రిఫైనరీ సముదాయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం ఇరు దేశాల సంబంధాలకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. అయితే, రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించనున్నారు. రష్యాపై ఇప్పటికే అమల్లో ఉన్న ఇతర ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్