ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మత్స్యకారుడు అప్పన్న సముద్రంలో గల్లంతయ్యారు. వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు.. ఈ నెల 16న విశాఖపట్నం గొల్ల వీధికి చెందిన ఉమ్మిడి ఎల్లయ్యకు చెందిన బోటులో ఎనిమిది మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి దాటాక విశాఖకు 11 నాటికల్ మైళ్ల దూరంలో జాలారిపేటకు చెందిన అప్పన్న బోటు నుంచి జారిపడి సముద్రంలో గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ కోసం అన్వేషణ చేపట్టారు. ఈ ఘటనపై విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ స్పందిస్తూ గాలింపు చర్యలను అధికారులు మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆయన చొరవతో రెండు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు గాలింపు చర్యల్లోకి దిగాయి. కోస్ట్ గార్డ్ బోట్లు, ఇండియన్ నేవీ బోటు, మూడు ప్రైవేటు బోట్లు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇండియన్ నేవీకి చెందిన దార్నియార్ విమానం సైతం రంగంలో దిగింది. మత్స్యకారుని ఆచూకీ లభించే వరకూ గాలింపు చర్యలు కొనసాగుతాయని కలెక్టర్ ప్రకటించారు.
Print Editionసముద్రంలో మత్స్యకారుడు గల్లంతు..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)