ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం నాడు కొట్టివేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి వరాలేతో కూడిన ధర్మాసనం తుది విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ‘పిటిషన్ దాఖలు చేయడానికి మీరెవరు? మొదటి నుంచి ఈ కేసును పరిశీలిస్తే, ఇది మీ వ్యక్తిగత వివాదంగా ఉంది తప్ప మరొకటి కనపడలేదు’ అని ఉండవల్లిని ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ‘మీరు వాదించేకొద్దీ మీ మీద అనుమానాలు పెరుగుతున్న్నాయి’ అని జస్టిస్ ఎంఎం సుందరేష్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రూ. 2,500 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లు మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్ర, నాగముత్తు తెలిపారు. క్లెయిమ్ చేయని మిగిలిన మొత్తం, రూ. 5.23 కోట్లు ఎస్క్రో అకౌంట్‌లో జమ చేసి ఉంచినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు హైకోర్టు వ్యవహరించిందని, అందుకు అనుగుణంగా పబ్లిక్ నోటీసు ఇచ్చి... తదుపరి ప్రక్రియను నిర్వహించారని తెలిపారు. వాదనల అనంతరం ఉండవల్లి పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.
Print Editionమార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి పిటిషన్ డిస్మిస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 09:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)