సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణం..

3 గంటల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 12:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో వారితో చీఫ్‌ జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆర్‌జి గోపి చదివి వినిపిం చారు. అదనపు న్యాయమూర్తులుగా ఉన్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జడ్జిల కుటుంబ సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నల్లారి ద్వారకనాథరెడ్డి తదితరులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్