- ఎస్‌ఐఆర్ క్లెయిమ్స్‌పై ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) లో క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢీల్లీరావు ఆదేశించారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలను ఈ నెల 10లోగా పరిష్కరించాలని సూచించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 30 వరకు అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం ఇఆర్‌ఓలు, ఎఇఆర్‌ఓలు, బిఎల్‌ఓలకు అవసరమైన సూచనలు జారీ చేసి, పెండింగ్ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. 6 వ తేది నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఫారం-6 దరఖాస్తులు 21 వేల మేర పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఫారం-6ఎ 490, ఫారం-7 3,974, ఫారం-8 పది వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)