వ్యక్తి సజీవ దహనం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఆస్పత్రికి వెళ్లివస్తుండగా కారులో మంటలు వ్యాపించి ఒకరు సజీవ దహనమైన ఘటన గుంటూరు నగరంలోని ఐపిడి కాలనీలోని సాయిబాబా ఆలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడికొండ హరికృష్ణ (53) డయాలసిస్ నిమిత్తం ఆయన కుమారుడు అఖిలేష్‌తో కలిసి కారులో ఆస్పత్రికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఇంటికి కొద్దిదూరంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అక్కడకు చేరుకొని అద్దలు పగల కొట్టి అఖిలేష్‌ను బయటకు తీశారు. మంటలు ఎక్కువ అవడంతో హరికృష్ణను కాపాడలేకపోయారు. దీంతో మంటల్లో చిక్కుకుని ఆయన సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయాలపాలైన అఖిలేష్‌ను ఆస్పత్రికి తరలించారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు.








కామెంట్‌లు (0)