ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మాజీ మేనేజర్ పి రాజేశ్వరరావు మృతి

1 గంట క్రితం

passed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 12:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి హైదరాబాద్ బ్యూరో : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మాజీ మేనేజర్ పి రాజేశ్వరరావు(70) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌‌లోని వనస్థలిపురం ప్రభుత్వాస్పత్రిలో ఆయన ఆదివారం మృతి చెందారు. రాజేశ్వరరావుమృతి సాహిత్య, ప్రచురణ రంగాలకి తీరనిలోటని పలువురు సాహిత్యవేత్తలు సంతాపం తెలియజేశారు. రాజేశ్వరరావు తొలుత ‌విజయవాడ విశాలాంధ్ర ప్రెస్‌‌లో పనిచేశారు. అనంతరం విశాలాంధ్ర బుక్ హౌస్ అనంతపురం బ్రాంచ్ మేనేజర్‌గా, అక్కడి నుంచి ఉద్యోగోన్నతిపై విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్‌గా హైదరాబాదులో బాధ్యతలు చేపట్టి సంస్థ అభివృద్ధికి, ప్రముఖ రచయితల , ఉత్తమ సాహిత్యాన్ని తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు. రాజేశ్వరరావుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్‌‌గా పనిచేసిన కాలంలో విశాలాంధ్ర బుక్ హౌస్ ఉద్యోగులకు సిపిఐ శాఖ సహకారంతో ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజేశ్వరరావు మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్