ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తాను చదివిన పాఠశాలకు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ

2 రోజుల క్రితం

ex cji
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 06:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మినరల్ వాటర్ ను ప్రారంభించిన ఎన్వి రమణ

ప్రజాశక్తి - వీరులపాడు : ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జమ్మవరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ జమ్మవరం గ్రామాన్ని పర్యటించారు. తను చదువుకున్న పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల కోసం తాగునీరు విద్యార్థులకు అందించాలని ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ ఉప విద్యాధికారి గురుమూర్తితో కలిసి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తికు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా అభ్యసించడం విద్యార్థులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు అందించటం ప్రభుత్వంతోపాటు దాతలు సహకారాలు అందించాలని కోరారు. తను చదువుకున్న పూర్వ పాఠశాలకు ఏదో ఒకటి సాయం చేయాలని ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులకు కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందని, దీని విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. పాఠశాలకు ఇంకా ఏమన్నా తన వంతు సహకారం అవసరమైతే తనకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూరిబాబు, మండల విద్య అధికారి కెనడి పాల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్